
ప్రజాశక్తి-గోకవరం : ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చంటిబాబు పాల్గొని దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసింది నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకోలేని పేదలకు ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శిబిరాన్ని, అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ ని పరిశీలించి రోగులకు,గర్భిణులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాసరి రమేష్, సుంకర వీరబాబు, కర్రీ సూరారెడ్డి, చింతల అనిల్ కుమార్, ఉప సర్పంచ్ దాకారపు దుర్గాప్రసాద్, మన్నె బుజ్జి, ఓమ్మి వెంకటరావు, బత్తిన వెంకటేశులు, షేక్ హుస్సేన్, వెండమురి శ్రీను, మంగళ వీరబాబు, ఎంపీడీవో కే పద్మజ్యోతి, సెక్రటరీ గోవింద్, వైద్య సిబ్బంది, సచివాలయం, అంగన్వాడి, ఆశ, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.