ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)ర్యాంకులను విడుదల చేసింది. గత నెలలో చెన్నైలో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో అజేయంగా నిలిచిన కారణంగా భారత్(2771) ఈ ర్యాంకు సాధించినట్లు తెలుస్తుంది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో యూరోహాకీ టైటిల్‌ను గెలుపొందిన ఇంగ్లాండ్ (2745) తొలి మూడు స్థానాల్లో ఉండేది. బలంగా ఉన్న ఇంగ్లాండ్ బెల్జియంతో జరిగిన టోర్నమెంట్‌లో ఓడిపోవడంతో నాలుగో స్థానానికి పడిపోయింది. యూరోహాకీ ఛాంపియన్‌షిప్స్ టైటిల్‌ను గెలుపొందిన నెదర్లాండ్స్ (3113) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. జర్మనీ (2689), ఆస్ట్రేలియా (2544) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలువగా, అర్జెంటీనా (2350) స్పెయిన్ (2347) కంటే ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది.
మహిళల ర్యాంకింగ్స్‌లో నెదర్లాండ్స్ (3422) అగ్రస్థానంలో కొనసాగగా, ఆస్ట్రేలియా (2818), అర్జెంటీనా (2767) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ మహిళా జట్టు(2325) ఒక స్థానాన్ని ఎగబాకి 7వ స్థానంలో నిలిచింది.