ప్రజాశక్తి-కొండాపురం : మండలంలో అక్రమ ఇసుక నిల్వలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది. వివరాలలోనికి వెలితే కొండాపురం మండలం కోడూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పెన్నానది నుండి అక్రమ ఇసుక తరలించి నిల్వలు ఉంచారు. ఇక్కడ దాదాపు 500 ట్రిప్పు ఇసుక నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ నిల్వలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ ఇసుక త్రవ్వకాల పై అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










