- శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ మైనింగ్లో వెల్లడైన అంశాలు
ప్రజాశక్తి - గంపలగూడెం: మండలంలో వినగడప రెవెన్యూ పరిధిలో గల శ్రీ లక్ష్మీ స్టోన్ క్రషర్ మైనింగ్ గోరంత అనుమతితో కొండంత తవ్వకాలు చేపడుతున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. సదరు మైనింగ్ యజమానులు అనుమతి పొందిన భూమిలో ఉన్న గుట్టలను మాత్రమే తవ్వాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా భూగర్భంలోకి దాదాపు 50 అడుగుల లోతు మైనింగ్ చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఆ మైనింగ్ ద్వారా నిరంతరం అక్రమ రవాణా కొనసాగుతుందని చెబుతున్నారు. మైనింగ్ చుట్టూ గ్రీన్ బెల్ట్ లేనందున చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాలు పంటలు పండుకుండా నాశనమవుతున్నట్లు తెలిపారు. అదేమని అడిగితే నోరున్నవారికి అద్దె చెల్లిస్తున్నట్లు పేద రైతులు తెలుపుతున్నారు. గ్రామానికి చేరువలో ఉన్న ఆ మైనింగ్ తో శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం వెరసి ప్రజలకు, పశువులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఈ మైనింగ్లో కంట్రోల్ బ్లాస్ట్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివలన ఆ ధ్వనికి రాళ్లు ఎగసిపడటంతో పాటు, గృహాల్లో ఉన్న వస్తువుల సైతం కింద పడిపోతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి నీద్రావస్థలో ఉన్నప్పుడు భయపడి లేచి కూర్చవలసి వస్తుందని, అంతేకాదు లక్షల పెట్టి ఇళ్ల నిర్మాణం చేపడితే అవి ఈ శబ్దాలకు నితరలిస్తున్నాయని వాపోతున్నారు. ఈ మైనింగ్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు రవాణాను అరికట్టాల్సిన అధికారులు పత్త లేరని ఆరోపిస్తున్నారు. వీళ్ళు చేస్తున్న బాంబు బ్లాస్ట్ వలన దుర్వాసన వచ్చి కొన్ని గంటలపాటు మనుషులు మనుషుల్లాగా కాలేకపోతున్నట్లు తెలుపుతూ వాంతులు అవుతున్నాయని చెబుతున్నారు. ఇటువంటి దుర్వాసనలేని బాంబులను వాడాలని కోరుచున్నారు. మైనింగ్ యాజమాన్యం చుట్టుపక్కల జనజీవనానికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని తెలుపుతున్నారు. మైనింగ్ చుట్టూ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసుకోవలసి ఉండగా ఈ మైనింగ్ వద్ద అటువంటి చర్యలు ఏమి చేపట్టిన దాఖలాలు లేవు. మైనింగ్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలకు వివిధ రూపాల్లో మెటీరియల్ను తరలిస్తుంటారని, 50 టన్నుల లోడుతో మాత్రమే ప్రయాణించాల్సిన టిప్పర్లు 75 టన్నులు పైగా వేయడంతో అవి 40, 20, కంకర రాళ్లు ప్రజల, వాహనాలు మీద పడుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా వచ్చే డస్టుతో కళ్ళు నలుచుకునే లోపు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుపుతున్నారు. ఇన్ని సమస్యలున్న ఈ మైనింగ్ నందు ఏనాడు అధికారులు కన్నెత్తి చూడరని ప్రజల ఆరోపిస్తున్నారు. మైనిక నిబంధనల ప్రకారం సదరు మైనింగ్ నుండి ట్రాన్స్ పోర్ట్ చెయ్ రహదారులకు ఇరువైపులా చెట్లను నాటాల్సి ఉన్న ఎక్కడా చేపట్టలేదని తెలుపుతున్నారు. మైనింగ్ ద్వారా జరిగిన లావాదేవీల్లో 2% నగదును సామాజిక భద్రతకు వినియోగించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులు కనుచూపుమేర కనిపించడం లేదు. మైనింగ్ కు ముందు, మైనింగ్ తరువాత ఆ ప్రాంతం ఒకేలా ఉండాలి. ఇక్కడ అట్టి పరిస్థితులకు విరుద్ధంగా కొనసాగుతూ, గోరంత అనుమతితో కొండంత త్రవ్వకాలు జరుపుతున్నారు.










