Nov 08,2020 00:47

తగరపువలసలో నినాదాలు చేస్తున్న టిడిపి నాయకులు

మధురవాడ : ఇళ్ల సమస్యపై జివిఎంసి జోనల్‌ కార్యాలయం వద్ద టిడిపి ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. నగరంపాలెం రోడ్డు నుంచి జివిఎంసి జోనల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాముకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోరాడ రాజబాబు, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకటరావు, వి.అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ పాల్గొన్నారు.
తగరపువలస : నా ఇల్లు - నా సొంతం నినాదంతో టిడిపి ఆధ్వర్యంలో తగరపువలసలో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. చిట్టివలస లేబర్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ వద్ద నిర్వహించిన ఈ ఆందోళనను ఉద్దేశించి పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, అధికార ప్రతినిధి పిట్ట సురేష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రవ్వ వెంకట్రావు మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పేదలకు నిర్మించిన ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పగించకపోవడం అన్యాయమన్నారు. పార్టీ నాయకులు కె.లీలావతి, పిట్ట శ్రీదేవి, సిహెచ్‌.నరసింగరావు, కోసూరు రాంబాబు, డి.పైడిరాజు, పిల్లా రాజేష్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : పూడిమడక గ్రామంలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు, మెరుగు బాబు నాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, రంగనాయకులు పాల్గొన్నారు.