ముంబయి : వారణాసి ప్రజలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కోరుకుంటున్నారని శివసేన (యుటిబి) సంజరు రౌత్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ మోడీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే తప్పకుండా గెలుపొందుతారని శివసేన (యుటిబి) సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ వారణాసి నుండి పోటీ చేస్తే తప్పక గెలుస్తారని జోస్యం చెప్పారు.
'వారణాసి ప్రజలు ప్రియాంకాగాంధీని కోరుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె వారణాసి నుండి ప్రధాని మోడీకి పోటీగా బరిలోకి దిగితే తప్పక విజయం సాధిస్తారు. రాయ్ బరేలి, వారణాసి, అమేథీల్లో బిజెపికి గట్టి పోటీ ఉంటుంది' అని వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య జరిగిన భేటీ గురించి అడిగిన ప్రశ్నకు సంజరు రౌత్ బదులిచ్చారు. ప్రధాని మోడీ.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకోగాలేనిది.. వారిద్దరు ఎందుకు కలుసుకోకూడదని ప్రశ్నించారు. అజిత్ పవార్ - శరద్‌పవార్ భేటీకి అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని సంజయ్ రౌత్ తెలిపారు. ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' సమావేశానికి అజిత్‌ను ఆహ్వానించి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు.










