ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : కుటుంబ పోషణ నిమిత్తం బెహరెన్ దేశానికి వెళ్లి యజమాని నిర్బంధములో వున్న సుమ అనే మహిళను జిల్లా మానవ హక్కుల సంఘం కృషితో స్వదేశంనకు రప్పించారు. ఈ సందర్భముగా శుక్రవారం సామర్లకోట మానవహక్కుల సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షుడు నూతలపాటీ అప్పలకొండ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భముగా అప్పలకొండ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతమూరు గ్రామనికి చెందిన రాపాక సుమ అనే ఆమె సుమారు సంవత్సరం క్రితం బెహరన్ దేశానికి కాకినాడ కు చెందిన ఏజెంట్ ద్వారా వెళ్లి ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి రావడంతో మా సంఘ అధికార ప్రతినిధి పిట్టా అప్పారావు బెహరెన్ దేశంలో ఇంటి యజమాని బాబాతో మాట్లాడి ఆమెను స్వదేశం తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. భాదితురాలు మాట్లాడుతూ బెహరెయిన్ దేశంలో ఇంట్లో పనిమనిషిగా పంపిన తర్వాత ఆ ఇంటి యజమాని ఒక మూడు నెలలు బాగానే పని చేయించుకున్న తర్వాత అక్కడ నుండి నన్ను చాలా ఇబ్బంది పెట్టారని నన్ను సరిగా చూసి వారు కాదని తెలియజేసింది. అలాగనే అనేక విమర్శలకు గురయ్యానని నన్ను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆ దేశంలో న్యూస్ జర్నలిస్టుని సంప్రదించగా అతని సూచన మేరకు జిల్లా మానవ హక్కుల సంఘం అధికార ప్రతినిధి పిట్టా అప్పారావుని సంప్రదించగా ఏజెంట్లతో మాట్లాడి సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ సహకారంతో తాను స్వదేశం ఇండియాకు వచ్చి నా భర్త పిల్లలు కలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. తాను స్వదేశం చేరుకోవడానికి కృషి చేసిన సంఘం ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ఆమె తెలిపారు. ఈ మీడియా సమావేశం లో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.










