Sep 27,2023 14:39

ప్రజాశక్తి - ఎర్రగుంట్ల :  గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పట్టణ పరిధిలోని ప్రకాష్ నగర్ లో ఇల్లు పూర్తిగా నేలమట్టం అయింది. మట్టి మిద్దె కావడంతో వర్షాల కారణంగా మిద్దె పైనున్న మట్టి తడిసి ఉండడంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంటి యజమానులు అయిన అప్పిగాళ్ళ కిట్టయ్య భార్య నాగమ్మ తమ పిల్లలతో కలిసి ఇంటి వరండాలో నిద్రిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.యజమానులు ఇంటిలో లేని సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఇల్లు కూలడంతో ఇంటిలోని వస్తువులు కూడా పగిలిపోయాయి. వస్తువులతో కలిపి సుమారు నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు యజమానులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇంటి యజమానులు ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇల్లు నిర్మించుకునేటందుకు ప్రభుత్వం సాయం అందించాలని యజమానులు కోరుతున్నారు. 

  • పరామర్శించిన చైర్మన్

వర్షం కారణంగా కూలిన ఇంటిని మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరిశీలించారు.ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.తహసీల్దార్ తో మాట్లాడి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం అందిస్తామని కుటుంబానికి భరోసానిచ్చారు.ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్,ఆర్ ఒ గంగిరెడ్డి,వైసీపీ నాయకుడు ప్రశాంత్, కౌన్సిలర్ ఎరికల్ రెడ్డి  ఉన్నారు.