Jun 03,2023 15:13

ప్రజాశక్తి-తెనాలి : ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి తెనాలి రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు స్టేషన్ మేనేజర్ మాస్టర్ టివి రమణ చెప్పారు. ఏదైనా సమాచారం కావాల్సిన వారు 227600 టోల్ ఫ్రీ నంబర్ లో సంప్రదించవచ్చన్నారు. రైల్వే అధికారులు వెల్లడించిన రిజర్వేషన్ జాబితా ప్రకారం తెనాలిలో హార్ట్ ఉన్న యశ్వంతపూర్ హౌరా ఎక్స్ప్రెస్ లో బాపట్ల నుంచి 2, విజయవాడ నుంచి 4, చీరాల నుంచి 12 మంది ఉన్నారని తెలిసింది. వీరి నుండి ఎటువంటి సమాచారం రానందున వీరందరూ క్షేమంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అలాగే యశ్వంతపూర్ హౌరా, హౌరా యశ్వంతపూర్, హౌరా మెయిల్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రస్తుతానికి సమాచారం ఉందన్నారు