Nov 13,2023 12:38

ఒకరోజు లలిత్‌ అనే అబ్బాయి దారిలో నడుస్తూ వెళ్తున్నా డు. అతనికి ఒక కాగితం, కలం కనబడ్డాయి. ఆ కాగితం మడిచి ఉండడం వల్ల తెరిచి ఒక వైపు చూశాడు. ఈ కాగితం మీద 'మీరు ఏమి రాస్తే అది జరుగుతుంది' అని ఉంది. వెంటనే అతను నాకు ఒక వజ్రం కావాలని రాశాడు. ఆశ్చర్యంగా వెంటనే ఒక వజ్రం వచ్చింది. ఈసారి నాకొక కూల్‌డ్రింక్‌ కావాలని రాశాడు. అది కూడా నిజంగానే వచ్చింది. ఆ తర్వాత నేను ఒక అడవిలోకి వెళ్ళాలి అని రాశాడు. నిజంగానే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. చుట్టూ పెద్దపెద్ద చెట్లూ, మృగాల అరుపులు.. భయం వేసింది. వెంటనే మళ్ళీ ఇంటికెళ్ళాలి అని రాశాడు. కానీ ఈసారి నిజం అవలేదు. ఏమిటి ఇలా జరిగింది అని కాగితం విప్పి మళ్ళీ చూశాడు. దాని చివర ఈ మాయాజాలం కేవలం మూడుసార్లే పనిచేస్తుంది అని రాసుంది. లలిత్‌ ఏడుస్తున్నాడు. అంతలో మెలకువ వచ్చింది. చుట్టూ చూశాడు. ఓహో ఇది కలా! అని కష్టపడకుండా వచ్చినవేవీ శాశ్వతం కావు అని మాష్టారు చెప్పిన విషయం గుర్తొచ్చింది.

సి. లలిత్‌ విష్ణు శరవణ్‌
6వ తరగతి
శ్రీవెంకటేశ్వర బాల కుటీర్‌, గుంటూరు
8985052188