బడిలో కొట్టిన దెబ్బలు
వైనం నేర్పే పాఠాలని
అనుభవం చూపే ఆ దారి
పూలబాటనే పేరుస్తుందని
చెప్పాలని ఉంది
ఎక్కిన మెట్లు ఎన్నైనా
మరువ కూడదని
ఆకాశమంత ఎత్తైదిగినా
భూమి తల్లిని చేరే బిడ్డలా
మాస్టారి చెంత ఒరగాలిరా
నీ చదువే
అసలైన నైవేద్యం గురువుకు
నీ ఉన్నతే సిసలైన గురుదక్షిణ!
యలమర్తి అనూరాధ
92472 60206