ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. దీక్షలకు మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ఛానల్ విస్తరణకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశ్యపూర్వకంగానే వైసిపి ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీయటం సరికాదని అన్నారు.










