ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూల్) : మండల పరిధిలోని ఏరూరు గ్రామం నుండి బంటనహల్ గ్రామానికి గ్రావెల్ రోడ్డు కు శనివారం ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ,చిప్పగిరి మండలం ఎంపీపీ హేమలత మారయ్య మరియు వైసీపీ మండల కన్వీనర్ ఏరూరు రంగస్వామి భూమి పూజ చేసి గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం వైసిపి మండల్ కన్వీనర్ ఏరూరు రంగస్వామి మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ, ఎంపీపీ జూటూరు హేమలత మారయ్య ల సహకారంతో ఏరూరు గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు ఏరూరు గ్రామం నుండి బంటనహాల్ రైల్వేస్టేషన్ కు సుమారు 5.5 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ,వైసిపి యువ నాయకుడు జూటూరు మారయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నామని అన్నారు. వైసిపి నాయకులు రాజన్న, శ్రీధర్, షేక్ అన్నా, బాలకృష్ణ, సతీష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.










