న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి కోడెడ్ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్ మెసంజర్ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సిఫార్సుల మేరకుతీవ్రవాద కార్యకలాపాల అణచివేతలో భాగంగా గూగుల్ ప్లే, యాప్ స్టోర్ వంటి మార్కెట్ ప్లేస్‌ల నుంచి వాటినితొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం నిషేధం విధించిన వాటిలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌వైజ్, వికర్‌మి, బ్రియార్, బీఛాట్, నాండ్‌బాక్స్, కొనియాన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగీ, త్రిమా ఉన్నాయి. దేశంలోని భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ''కాశ్మీర్‌లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదుల కదలికలు, వారి సమాచార మాధ్యమాలపై ఏజెన్సీలు దృష్టిపెట్టాయి. కొన్ని యాప్స్‌నకు దేశీయంగా ఒక్క ప్రతినిధి కూడా లేని విషయం బయటపడింది. ఇలాంటి వాటిల్లో జరిగే కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టం'' అని ఓ అధికారి వెల్లడించారు. జాతీయ భద్రతకుముప్పుగా పరిణమించే, భారత చట్టాలను పాటించనియాప్‌ల జాబితాను సిద్ధం చేసి, ఇన్ఫర్మేషన్ టెకాులజీ యాక్ట్ 2000లోనిసెక్షన్ 69 ఎ కింద బ్లాక్ చేసినట్లు తెలిపాయి.