హైదరాబాద్: ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్ 'గమ్యం'తో ముందుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్‌ను ఎంజీబీఎస్ బస్టాండ్‌లో సంస్థ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం కూడా పలు ఫీచర్‌లను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. డయల్ 100, 108కి కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సజ్జనార్ కఅతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమ సిబ్బందికి గుర్తింపు దొరికిందన్నారు. '' ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సంస్కరణలను సంస్థ తీసుకువచ్చింది. రూ.200 కోట్లతో బస్టాండ్‌లను అభివఅద్ధి చేస్తున్నాం. సిబ్బంది ఆరోగ్యాన్ని చూసుకునేందుకు...ప్రతి డిపోలో ఒక హెల్త్ వాలంటీర్ ఉన్నారు. 'ప్రజల వద్దకు ఆర్టీసీ' కార్యక్రమంతో ప్రజా రవాణా వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నాం. బస్సులు ట్రాక్ చేసేందుకు ఇప్పుడు గమ్యం యాప్‌తో ముందుకు వచ్చాం. మ్యాప్ మై ఇండియా సహకారంతో యాప్‌ను నేడు విజయవంతంగా లాంచ్ చేస్తున్నాం. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గమ్యం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రజలంతా కలిసి ఈ యాప్‌ను విజయవంతం చేయాలి'' అని సజ్జనార్ కోరారు.