Jun 28,2022 08:25

జీమెయిల్‌ యూజర్లకు గూగుల్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌ అవసరం లేకుండా కూడా మెయిల్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చునని తెలిపింది. అంటే ఇక నుండి ఇంటర్నెట్‌ అవసరంలేకుండా ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ ద్వారా మెయిల్ చదవడం, రిప్లై ఇవ్వడంతోపాటు జీమెయిల్‌ మెసేజ్‌లను కూడా చూడొచ్చు. దీంతో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాలతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని వారికి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సర్వీస్‌ గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో మాత్రమే పనిచేస్తుంది. అలానే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయదు. 

  •  జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలు ఇలా ఎనేబుల్ చేయాలి....
  1. జీమెయిల్‌ సేవలు ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకునేందుకు ఇంటర్నెట్‌ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పుడే mail.google.comను క్రోమ్‌ బ్రౌజర్‌లో బుక్‌ మార్క్‌ చేసుకోవాలి.
  2. తరువాత ఓపెన్ జీమెయిల్ - సీ ఆల్ సెట్టింగ్స్- ఆఫ్ లైన్ పై క్లిక్ చేసి, ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ 
  3. సెలెక్ట్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ - ఎన్ని రోజుల క్రితం ఈ-మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేయాలని అడుగుతుంది. సెలెక్ట్ డేస్ (వారం/నెల/90 రోజులు) - సేవ్‌ ఛేంజస్‌
  4. కొంతమందికి జీమెయిల్ ఖాతా ఆఫ్‌లైన్‌ ఆప్షన్స్‌లో ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ అనే ఆప్షన్‌ కనిపించకుండా ఎండ్‌ స్పేస్‌ అనే మెసేజ్‌ కనిపిస్తుంది. అంటే మీ గూగుల్ ఖాతాకు కేటాయించిన స్టోరేజ్‌ నిండిపోయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో గూగుల్ ఖాతాలో అనవసరపు డేటాను డిలీట్ చేయడం మేలు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను స్టోర్‌ చేసుకునేందుకు జీమెయిల్‌కు కొంత స్టోరేజ్‌ అవసరం ఉంటుంది.