Sep 27,2023 16:22

ఇంటర్నెట్‌డెస్క్‌ : జీమెయిల్‌, ఫొటోస్‌, మ్యాప్స్‌ ఇలా ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే.. గూగులమ్మను అడగటం పరిపాటైంది. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకోబోయే ముందు వరకు గూగుల్‌ మన జీవితాల్లో భాగమైపోయింది. రోజూ మనం చూసే.. వెతికే గూగుల్‌ ఎప్పుడు పుట్టిందోతెలుసా..?! గూగులమ్మ పుట్టి నేటికి సరిగ్గా పాతికేళ్లు. సరిగ్గా ఈరోజే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థులుగా ఉన్న లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్లు గూగుల్‌ని స్థాపించారు.

- జనవరి 1996లో లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి పరిశోధనా ప్రాజెక్టుగా 'గూగుల్‌'ని స్థాపించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో పేజ్‌, సెర్గీ బ్రిన్‌లు కాకుండా 'స్కాట్‌ హసన్‌' అనే ప్రోగ్రామర్‌ మూడవ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. హసన్‌ గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కోసం చాలా కోడ్‌లను రాశాడు. అయితే గూగుల్‌ అధికారిక కంపెనీగా స్థాపించకముందే.. హసన్‌ ఈ కంపెనీ నుంచి నిష్క్రమించాడు. ఇతను 2006లో విల్లో గ్యారేజ్‌ అనే సంస్థను స్థాపించాడు.

గూగుల్‌ మొదటి పేరు 'బ్యాక్‌రబ్‌'. సెర్చ్‌ ఇంజిన్‌లో ఒక వెబ్‌ పేజ్‌ నుంచి మరో వెబ్‌ పేజీకి లింక్‌లను జత చేసేవారు. అలా గూగుల్‌కి మొదటగా 'బ్యాక్‌ రబ్‌' అని పేరు పెట్టారు.

గూగుల్‌ అనే పదం 'గూగోల్‌' అనే పదం నుంచి వచ్చింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్యను గూగోల్‌ అని పిలుస్తారు. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.

- గూగోల్‌ కాకుండా.. గూగుల్‌ అని పిలవడం వెనుక ఓ కారణం ఉంది. ఓ ఉద్యోగి టైపింగ్‌లో చేసిన తప్పిదం వల్ల గూగోల్‌ కాకుండా.. గూగుల్‌ అనే పదంగా మారింది.
- చిన్న కంపెనీగా ఉన్న గూగుల్‌ 2004లో ఐపిఓ ద్వారా బహిరంగ సంస్థ అయింది. 2005 సెప్టెంబర్‌ 27న ఈ కంపెనీ వార్షికోత్సవం జరుపుకోవడం ద్వారా అధికారికంగా సెప్టెంబర్‌ 27వ తేదీ గూగుల్‌ బర్త్‌డే అయింది.

- కంపెనీ వ్యవస్థాపకులకు వెబ్‌ పేజీల రూపకల్పనలో తక్కువ అనుభవం ఉన్నందున గూగుల్‌ హెమ్‌ పేజీ చాలా సింపుల్‌గా ఉంటుంది.

- గూగుల్‌ 2006లో 'యూట్యూబ్‌ని కొనుగోలు చేసింది.
- 2010 నుండి గూగుల్‌ కనీసం వారానికొక కంపెనీని కొనుగోలు చేసిందని అంచనా. 2021 సమాచారం ప్రకారం.. గూగుల్‌ 827 కంపెనీలను కొనుగోలు చేసింది.
- గూగుల్‌లో ప్రతి సెకనుకు 60 వేల కంటే ఎక్కువ సెర్చ్‌లు జరుగుతాయి.
- గూగుల్‌ సెకనుకి 5.5 సంపాదింస్తుందని అంచనా.
- గూగుల్‌కి ఆరు ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా సెంటర్లు ఉన్నాయి.
- 2019 మార్చి 19న స్టేడియా అనే క్టౌడ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను గూగుల్‌ ప్రారంభించి వీడియో గేమ్‌ మార్కెట్‌లోకి గూగుల్‌ ప్రవేశించింది. అలాగే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌ తయారుచేసింది.