ప్రజాశక్తి-కోవూరు : ప్రజానాట్యమండలి కెవిపిఎస్ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కోవూరు సీతా పొలయ్య భవనం నందు గుర్రం జాషువా 52వ వర్ధంతి సభ జరిగినది. నెల్లూరు టౌన్ ప్రజానాట్యామండలి అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ గుర్రం జాషువా తన కవిత్వం ద్వారా కుల గోడలను బద్దలు కొట్టిన మహాకవి ఆని గుంటూరు జిల్లా వినుకొండలో యాదవ అరుంధతి కులములకు చెందిన వీరయ్య, లింగమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 28న జన్మించారని కటిక పేదరికం మధ్యలోనే అదంపతులు పిల్లలను పెంచారు. నిరంతరం జాషువా నిరాదరణ అవమానాలకు కుమిలి పోయినారు. కవిత్వంలో హిందూ పురాణాలు రాస్తున్నారని అయిన కుటుంబాన్ని క్రైస్తవ మతం నుండి వెలివేశారు అయినా నిరాశ పడకుండా గబ్బిలం, పిర్డోసి, బాపూజీ కవితల ద్వారా ఆనాటి పండితులు సైతం శిరస్సు వంచి గౌరవించారు. అప్పటి కవులలో ఒకరైన చెప్పీళ్ల వెంకట శాస్త్రి జాషువా కాళ్లకు గండపెండాన్ని తొడిగారు అన్నారు. అలాంటి మహాకవి రచనలను నేటితరం యువత చదివి మంచి సమాజాన్ని నిర్మించాలని కోరారు. పై కార్యక్రమంలో గండవరపు శేషయ్య, తిరుపాలు, విజయికు మార్, రఘురామయ్య ప్రభుదాసు, బాబు, బుజ్జయ్య మోహన్, రత్నమ్మ, శివ, కరిముల్లా, మస్తానయ్య, గోవర్ధన్, కాలేశా, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.










