
ప్రజాశక్తి- ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఉదయగిరి వైసిపి మండల అధ్యక్షులు గానుగపెంట ఓబుల్ రెడ్డిని జడ్‌పిటిసి రామాంజనేయులు పరామర్శించారు. సోమవారం మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి తల్లి సుబ్బమ్మ (90) సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్‌పిటిసి రామాంజనేయులు సుబ్బమ్మ మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. పలువురు నాయకులు సమీప బంధువులు స్వగ్రామైన గానుగపెంట పల్లికి అధిక సంఖ్యలో చేరుకొని భౌతిక ఖాయాన్ని సందర్శిస్తున్నారు.