నెల్లూరు : కమ్యూనిస్టు సానుభూతిపరుడు ఆవుల రమణయ్యకు సిపిఎం నేతలు నివాళులర్పించారు. డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో దీర్ఘాకాలం కాంపౌండర్‌గా, ల్యాబ్ టెక్నీషియన్‌గా సేవలందించి, తుది శ్వాస విడిచేవరకు కమ్యూనిస్ట్ సానుభూతిపరుడిగా ఉన్న ఆవుల రమణయ్య బుధవారం కన్నుమూశారు. రమణయ్య భౌతికకాయానికి ఎర్రజండా కప్పి సిపిఎం నేతలు నివాళులు అర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీనియర్ నాయకులు చండ్రా రాజగోపాల్, కె.అజరు కుమార్, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, ప్రజా వైద్యశాల డాక్టర్లు జి.రమేష్ బాబు, ఎం.వి.రమణయ్య, సిపిఎం నాయకులు నివాళులర్పించారు.