Oct 08,2020 12:52

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఢిల్లీకి సమీపంలోని హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వేదికగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో రాఫెల్‌ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు యుద్ధ విమానాలు తమ సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా సైనికులను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వైమానిక దళం సేవలను చూసి జాతీ యావత్తు గర్విస్తోందని అన్నారు. సంక్లిష్ట పరిస్థితులను పైలెట్లు ఎదుర్కొంటూ దేశానికి సేవలందిస్తున్నారని అన్నారు. కాగా, ఇటీవలే అపాచీ, రాఫెల్‌ యుద్ధవిమానాలు వైమానిక దళంలోకి చేరాయని, వాటి రాకతో సైన్యం శక్తి మరింత పెరిగిందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేష్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు.