
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర సన్నిధికి బంగారు సింహాసనాన్ని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి దంపతులు ఆదివారం అందజేశారు. బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ దంపతులు, దివ్యశ్రీ మజ్జి రామారావు కళావతమ్మ దంపతుల జ్ఞాపకార్ధం ఆలయానికి బంగారు సింహాసనాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. ఆదివారం ద్వారకా తిరుమల వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్లిన ఝాన్సీ లక్ష్మి, బొత్స తనయుడు డాక్టర్ బొత్స సందీప్ పూజిత దంపతులు ఆదివారం స్వామి వారికి విశేష పూజలు అభిషేకం జరిపించి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు బంగారు సింహాసనంను అందజేశారు. దీనికి సంబంధించి గారంటీ పత్రాలను ఆలయ అధికారులకు అందజేశారు.