Dec 30,2020 20:59

వినాయకున్ని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్‌



ప్రజాశక్తి - ఐరాల : స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌, ఎన్‌.వి.రమణ రెడ్డి, ఐ ఆర్‌ ఎస్‌ ఢిల్లీ ఏపీ భవన్‌ రెసిడెన్షియల్‌ కమిషనర్‌, చిత్తూర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి వెంకట హరినాథ్‌ స్వామివారినిి వేర్వేరు గా దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన వీరికి ఆలయ మర్యాద ప్రకారం రాజ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.