ప్రజాశక్తి-ఏలేశ్వరం : అవినీతిరహిత పారదర్శక పాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన ఏలేశ్వరంలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వాలలో ఏ పనున్న కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారు అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైకాపా నాయకులు అలమండ చలమయ్య, శిడగం త్రివేణి, సుంకర రాంబాబు, వాగు బలరాం, తొండారపు రాంబాబు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ఉన్నారు.










