Oct 21,2023 16:31

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా జగంపేట ఎమ్మెల్యే చంటిబాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల వివిధ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మించిన రెండు వెల్నెస్ సెంటర్ల భవనాలను, ఒకటి రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. అలాగే బీసీ వర్గానికి చెందిన నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన బీసీ యాదవ వర్గానికి చెందిన బీసీ కమిటీ  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాసర రమేష్, సుంకర వీరబాబు, పాటి రాంబాబు, పోత బత్తుల శ్రీనివాస్, మంజూరు అప్పారావు, మడికి మైనరుబాబు, గోకాడ చిట్టిబాబు, దొడ్డ విజయ్, నారాశెట్టి నరసయ్య, తోలేటి రాంప్రసాద్, ఎంపిటిసి సర్పంచులు నాయకులు కార్యకర్తలు ఎం రాజేశ్వరరావు చిన్న కుమార్ రెడ్డి, పి ఆర్ జె ఈ అబ్బాయిదొర,ఆర్ డబ్ల్యు ఎస్ రామకృష్ణ.తదితరులు పాల్గొన్నారు.