అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరు కళ్లు లేనివారు. ఇంకొకరికి కాళ్ళు లేవు. ఒక రోజు పరీక్షలకు కాళ్ళు లేని అమ్మాయి చదువుకుంటుండగా కరెంటు పోయింది. లేవలేని స్థితిలో బాధ పడుతూ కూర్చుంది. కళ్ళు లేని అమ్మాయి విషయం అర్ధం చేసుకుని తన స్నేహితురాలికోసం దీపం వెలిగించి వెలుతురు చూపింది. కొన్ని రోజుల తరువాత కాళ్ళు లేని అమ్మాయి బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం సంపాదించింది. తన స్నేహితురాలికి చూపు తెప్పించింది. ఇద్దరు స్నేహితులూ సంతోషంగా ఉన్నారు.
నీతి : స్నేహం అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం
ఒకరి కష్టాలు ఒకరు తీర్చడం.. కష్ట సమయాలలో తోడుగా ఉండటం.
జె. వేదశ్రీవర్ష
6వ తరగతి , పాలకొల్లు