ప్రజాశక్తి-పెనుకొండ : ధర్మవరం ఆత్మీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం నగరానికి చెందిన మార్క్ సూపర్ స్పెషాలిటీ హార్ట్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శనివారం పెనుకొండ పట్టణంలోని ఎస్ వి ఆర్ హాస్పిటల్ నందు నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరం కు అనూహ్య స్పందన లభించింది. ఈ శిబిరంను ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్,యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి,సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ఏ.హరి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆత్మీయ ట్రస్ట్ సమాజ సేవ, సమాజ హితం కొరకు నిర్వహించే నిస్వార్థ సేవా కార్యక్రమాలు అభినందించదగినవని తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు 2డి ఎకో/ఈసీజీ/బ్లడ్ షుగర్/బి.పి. వంటి వైద్య పరీక్షలను ఉచితంగా అందించడం గొప్ప విషయమని, ఆత్మీయ ట్రస్ట్ సేవలను అభినందించారు. ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన మార్క్ ఆసుపత్రి యాజమాన్యానికి ఆత్మీయ ట్రస్ట్ గౌరవ సలహాదారులు ఎం.సుధాకర్, ఈ నారాయణ స్వామి, స్థానిక ఎస్ వి ఆర్ హాస్పిటల్ యాజమాన్యం రామలింగ నాయుడు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో అందరి సహకారంతో ఆత్మీయ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 154 మంది వైద్య పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ హాస్పిటల్ డాక్టర్లు అమర్ మహేష్, నాగరాజు, మేనేజర్ వెంకటేష్, యుటిఎఫ్ నాయకులు రమేష్, నరేష్ ఎం.కె.నబీ, మహాలింగప్ప, పెద్ది రాజు, గంగాధర్, రామాంజినేయులు శేషాద్రి, తిప్పేస్వామి, సత్యమయ్య తదితరులు పాల్గొన్నారు.










