Feb 13,2023 15:13

ప్రజాశక్తి-చందర్లపాడు: మండలంలోని గుడిమెట్ల గ్రామంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెకంటి జీవరత్నం ఆధ్వర్యంలో నందిగామలోని ఐకాన్ కేర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరమును బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవరత్నం, గ్రామ సర్పంచ్ ఆల చిన సైదమ్మ , మండల వైస్ ఎంపీపీ చెన్నవరపు కల్పనలు ప్రారంభించారు. ఐకాన్ కంటి ఆసుపత్రి డాక్టర్ భార్గవ్, డాక్టర్ మన్నెం నవ్య, డాక్టర్ కృష్ణ చైతన్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొడేపుడి వేణు బాబు, ఎక్స్ ఎంపీటీసీ మర్రిబోయిన బుజ్జి, నాయకులు బోడేపూడి సాగర్ , మందదపు అప్పారావు, కొమ్మ నరసింహారావు, మొగిలిచర్ల రామదాసు, మొగిలిచర్ల సీమోను, షేక్ బాషా, షేక్ జాన్ భాష, ఆర్ఎంపీ డాక్టర్లు వల్లరపు నరసింహారావు, కోట భాస్కర రావు, ఎద్దుల కోటేశ్వరరావు, వివిధ పార్టీల నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.