- - ఒక్కడే 126 కేసుల్లో నిందితుడు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బ్యాంకు ఖాతాదారులకు దాచుకున్న తమ నగదుపై ఆందోళన పెరిగిపోతోంది. కొరతమంది ముఠాగా ఏర్పడి ఖాతాదారుల వేలిముద్రలను సేకరిరచి, వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసి బ్యారకుల్లోని వారి ఖాతాల్లో ఉన్న నగదును స్వాహా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ (ఎస్‌ఎల్‌సిసి) కూడా సమీక్షిరచిరది. ఇందులో అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు కూడా ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఆరధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే లక్ష మందికిపైగా ఖాతాదారుల ఆధార్, వేలిముద్రల క్లోనింగ్‌లు ముఠా చేతుల్లో ఉన్నట్లు తేలిరది.
ఇటువంటి కేసు ఇటీవల కడప జిల్లాలో బయటపడిరది. ఇక్కడ ఆధార్ నెంబరును ఉపయోగిరచి, లబ్ధిదారుని వేలిముద్రను క్లోనిరగ్ ద్వారా సిద్ధంచేసి బ్యారకు ఖాతాలోని నగదును దొరగిలించినట్లు తేల్చారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెరట్ సిస్టమ్ ద్వారా జరిగిన ఈ కేసులో నిందితులు ఇరటర్మీడియరీ పేమెరట్ గేట్‌వే యాప్ ద్వారా వేలిముద్రలను సేకరిరచినట్లు గుర్తిరచారు. నిరదితులు వేలిముద్రలను క్లోనిరగ్ చేసేరదుకు అవసరమైన మిషన్లను కూడా సేకరించుకురటున్నట్లు గుర్తిరచారు. ఈ విధానం ద్వారా ఖాతాదారులకు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌లను కూడా తెలుసుకురటున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో కడప పోలీసులు అరెస్ట్ చేసిన విశ్వకర్మ అనే వ్యక్తి నురచి మరిన్ని వివరాలు తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇతనిది ఉత్తరప్రదేశ్ కావడంతో ఇటువంటి కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెరదిన ముఠాలు కూడా ఉన్నట్లు తేలిరదని రాష్ట్ర స్థాయి అధికారులు చెబుతున్నారు. వారు పాలిమర్ షీట్, బటర్ పేపర్, ఫొటోషాప్‌లను ఉపయోగిస్తున్నట్లు కూడా కనుగొన్నారు. కడప కేసులో అరెస్టు చేసిన నిరదితుడే తెలంగాణలోని 117 కేసుల్లో, ఉత్తరాఖండ్‌లో రెరడు కేసుల్లో, జార్ఖరఢ్‌లో మూడు కేసుల్లో, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానాల్లో ఒక్కో కేసులో ఉన్నట్లు కూడా గుర్తిరచడం వల్ల ఈ సమస్య దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తేలింది. నిందితుల్లో కొంత మంది కస్టమర్ సర్వీస్ పాయిరట్లను ఏర్పాటుచేసుకుని, ఈ-గవర్నెన్స్, బ్యారకిరగ్ సర్వీస్ పేరుతో వేలిముద్రలు, ఆధార్ కార్డులను సేకరిస్తున్నట్లు తేలిరది.










