Nov 13,2023 14:42

రైతే దేశానికి వెన్నముక...
అతడలిగితే లేదు మనకు అన్నమిక
కోటి విద్యలు అన్ని కూటి కొరకన్నారు
కూడు గోడును బాప రైతన్నలున్నారు... !
రైతే దేశానికి వెన్నెముక
అతడలిగితే లేదు మనకు అన్నమిక
నడుమొంచి కష్టించి పాడి పంటలు పెంచి...
పొట్ట చల్లం గుండగ పోషించు అన్నదాత...
రైతే దేశానికి వెన్నెముక అలిగితే లేదు మనకు అన్నమిక

తనేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు
సమాజ గమనానికి సాయపడుతున్నాడు.
రాత్రనకా, పగలనకా ఆత్రంగా పనిచేస్తూ...
సోమరితన మొద్దని చాటి చెప్పే ధీరుడు.
ఎండకు ఎండినా, వాన లో తడిసినా -
చలిలో వణికినా.. సమస్యలతో నలిగినా..
సడలని ఆత్మ స్థైర్యంతో సమస్యలను అధిగమిస్తూ
జాతిసేవలో పునీతుడై నిలిచినాడు రైతన్న
రైతే దేశానికి వెన్నెముక
కోటి విద్యలు కూటి కొరకన్నారు
కూడు..గూడు లేని రైతన్నలున్నారు.
రైతే దేశానికి వెన్నెముక
అతడలిగితే లేదు మనకు అన్నమిక !


బి. ఐశ్వర్య
10వ తరగతి
ఎల్‌. ఆర్‌ జి విద్యాలయం
కిరికేరా, హిందూపురం