మిలన్ : ఇటలీ మాజీ ప్రధాని, దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీని స్థాపించిన వ్యాపారవేత్త సిల్వియో బెర్లూస్కోనీ (86) సోమవారం కనుు మూశారు. ల్యుకేమియాతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. ప్రధాని జార్జియా మెలోని మితవాద సంకీర్ణంలో బెర్లూస్కోనీ పార్టీ భాగస్వామిగా వునుందున ఆయన మృతితో రాబోయే మాసాల్లో ఇటలీ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం వుంది. డిప్యూటీ ప్రధాని మాటో సల్విని ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, బెర్లూస్కోనిని గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందని రక్షణమంత్రి గుయిడో క్రాసెటో ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఆయనను తానెంతో ప్రేమిస్తానని అన్నారు.
కాగా, 1936లో మిలన్‌లో జన్మించిన బెర్లూస్కోనీ పాతికేళ్ళ వయస్సులో రియల్ ఎస్టేట్‌లో తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత మీడియా, పబ్లిషింగ్, ఆర్థిక సేవలతో కూడిన ఫిన్‌ఇన్‌వెస్ట్ హోల్డింగ్ కంపెనీ స్థాపించారు. 1994-95, 2001-2006, 2008-2011మధ్య కాలంలో ఆయన ప్రధానిగా చేశారు. 1994లో 'ఫోర్జా ఇటాలియా' (గో ఇటలీ) మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఎనిుకల్లో గెలుపొందడంతో మొట్టమొదటిసారిగా ఆ ఏడాది మే నుండి డిసెంబరు వరకు ప్రధానిగా చేశారు. 1996లో అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొన్నారు. తప్పుడు లెక్కలు చూపించినందుకు 16మాసాలు జైలు శిక్ష కూడా విధించారు. కానీ తర్వాత అప్పీల్‌పై ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 2001లో తన మితవాద కూటమి సార్వత్రిక ఎనిుకల్లో గెలుపొందడంతో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఐదేళ్ళు పనిచేశారు. తిరిగి 2008లో మళ్ళీ ప్రధానిగా ఎన్నికైనా దేశంలో చెలరేగిన ఆర్థిక సంక్షోభం సమయంలో రాజీనామా చేశారు. తన మీడియా సామ్రాజ్యం ద్వారా పనుుల్లో అవకతవకలకు పాల్పడినందుకు నాలుగేళ్ళు శిక్ష కూడా అనుభవించారు. దాంతో పదవిని పొగొట్టుకున్నారు.










