May 11,2023 13:16
  • న్యాయవాది శ్రీధర్ రెడ్డి.

ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : విద్యార్థుల శారీరక అభివృద్ధికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అడ్వకేట్ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని అవుట్డోర్ స్టేడియం నందు అథ్లెటిక్స్, ఫుట్ బాల్  వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించి క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్ విడి ఆటల సాధన వైపు మొగ్గు చూపడం శుభపరిణామం అన్నారు.  వేసవి శిక్షణ శుభిరాలు విద్యార్థులకు చక్కగా దోహదపడతాయి అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రధాన శిక్షకులు నటరాజరావు మాట్లాడుతూ ప్రతిభగల యువ క్రీడాకారుల రాణింపే లక్ష్యంగా రాష్ట్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణ శిబిరాలను  కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి అవినాష్ శెట్టి, బి.క్యాంప్ ఫుట్బాల్ సంఘం కార్యదర్శి పాల్ విజయ్ కుమార్, శిక్షకులు బ్రహ్మ, హారిక, కాశీరావు, ఇస్మాయిల్, జగదీశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.