ప్రజాశక్తి-చింతూరు : అల్లూరి జిల్లా చింతూరు నుండి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారి-30 ముంపు గురైంది రవాణా స్తంభించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 51 అడుగులకు చేరింది. చింతూరు శబరి నది నీటిమట్టం క్రమేపి పెరుగుతూ 30.5 అడుగులకు ప్రమాద స్థాయిలో చేరి ప్రవహిస్తోంది. జలదిగ్బంధంలో 50 గ్రామలు ఉన్నాయి. సోకులేరు వాగు పొంగడంతో నర్సింగ పేట, ముకునూరు, ఉలుమూరు, ఏజి కోడేరు, మల్లె తోట, జలి వారి గూడెం, చూటూరు గ్రామాలు జరదిగ్బంధంలో ఉన్నాయి. ఇదే క్రమంలో చంద్రవంక వాగు పొంగడంతో చట్టి కుమ్మూరు మామిడిగూడెం మరియు కుయుకురు వాగు పొంగి ప్రవహించడంతో ఆంధ్ర-ఒడిస్సాకు బుధవారం నుండి రాకపోకలు నిలిచిపోయాయి. కల్లేరు, మధుగూరు, సూరన్న గొంది గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి.










