ప్రజాశక్తి-తుగ్గలి : కర్ణాటక ప్రాంతం నుండి ఎద్దులదొడ్డి మీదగా పెండేకల్లు పోవు రోడ్డు నందు పెండేకల్ గ్రామము ట్రాక్టర్ ఇంజన్ నెంబర్ AP39 TS 7138 ట్రాలీ నెంబర్ AP21 TB 3132 ట్రాక్టర్ యజమాని నాగభూషణం ట్రాక్టర్ లో పెండేకల్లు గ్రామానికి వరిగడ్డితో గురువారము 9 గంటల ప్రాంతంలో బయలుదేరాడు. ఎద్దులేదొడ్డి సమీపంలోని డౌన్లో ట్రాక్టర్ పోవడంతో అక్కడ పైనున్న వైర్లు తెగిపోయి షార్ట్ సర్క్యూట్ రావడంతో వర్రి గడ్డి పూర్తిగా కాలిపోయింది. గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ తప్పించుకున్నాడు. ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫైర్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఫైర్ స్టేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. ట్రాక్టర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్తులు తెలిపారు.










