- స్నేహితురాలు కుటుంబానికి రూ50 వేలు ఆర్థిక సహాయం
ప్రజాశక్తి-చిప్పగిరి : అనారోగ్యంతో తోటి స్నేహితురాలి భర్త చనిపోవడంతో స్నేహితురాలు ఇబ్బందులు చూసి స్నేహితులు బృందమంతా కూడా ఆర్థిక సహాయం అందించారు. మండల పరిధిలోని నేమకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994 బ్యాచ్కు చెందిన తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్ష్మి ఏరూరు గ్రామానికి చెందిన బారికి విరేష్ తో వివాహం అయింది. తన భర్త బారికి విరేష్ 47 సం,, నెల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం వైసీపీ కన్వీనర్ ఏరూరు రంగస్వామి ఆధ్వర్యంలో మిత్ర బృందం స్నేహితురాలు కుటుంబాన్ని పరామర్శించి మీకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని కుటుంబానికి రూ 50 వేలు ఆర్థిక సహాయం అందించి తమ దాతృత్వం చాటుకున్నారు. స్నేహితురాలు కుటుంబ సభ్యులందరూ కూడా స్నేహితురాల మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.










