Jun 04,2023 15:26
  •  ఏరువాకు పౌర్ణమి వేడుకల్లో పాలకుర్తి దివాకర్ రెడ్డి 

ప్రజాశక్తి-మంత్రాలయం : రైతుల కళ్లలో ఆనందం చూడడమే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో జరిగిన  ఏరువాకు పౌర్ణమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగలి పట్టి  పోలం దున్ని రైతులకు మంచి జరగాలని మంచి దిగుబడులు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రైతులు కోసం తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నదాత పథకం కింద 20 వేలు రూపాయిలు సహాయము ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండే పార్టీ తెలుగు దేశం పార్టీ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి,తెలుగు రైతు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, క్లస్టర్ ఇన్ చార్జ్ చావిడి వెంకటేష్,నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, వగరూరు అబ్దుల్ సాబ్,పవన్ కూమర్ రెడ్డి,రాగన్న, రోగప్ప, మాలపల్లి భీమన్న ఆచారి, చంద్ర,వీరేష్,లక్ష్మన్న,లక్ష్మారి జెట్టి వీరేష్,తెలుగు యువత రాజశేఖర్,అంజి తదితరులు పాల్గొన్నారు.