Jul 12,2023 15:32

ప్రజాశక్తి-దేవనకొండ : ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పత్తి, ఆముదము, వేరుశనగ తదితర విత్తనాలను పొలాల్లో నాటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొలకలు రాక నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, నాయకుల అశోక్, యూసుఫ్ భాష బుధవారం డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తాసిల్దార్ కు సుదర్శన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రారంభంలో పత్తి ఇతర విత్తనాలు ఒకటికి రెండుసార్లు రైతులు ఆశతో విత్తనాలు వేశారని కానీ నాటిన, వేసిన విత్తనాలు మొలవక, మొలచిన గిటక బారిపోవడం, ఎర్రబారిపోవడంతో రైతుకు చాలా నష్టం జరిగిందన్నారు. ఎకరాకు వేలకు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు వర్షాబావ పరిస్థితి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అప్పుల పాలవుతున్నారని వెంటనే ప్రభుత్వం ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులను గుర్తించి వారిని ఆదుకోవాలని వారికి ఉచితంగా విత్తనాలు, మందులు, ఎరువులు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా విత్తనాలు వేస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ తగిన సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే నష్టం ప్రభుత్వం ఎంత అంగం తగ్గించే విధంగా చూడాలని వారు కోరారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. పందికొన రిజర్వాయర్ నుండి హంద్రీనీవా  కుడి కాలువకు నీళ్లు వదలాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రజాసంఘాల కార్యకర్తలు మహబూబ్ బాషా, ఓంకార్, అనిల్, పాండు, శ్రీనివాసులు, వీరన్న రైతులు పాల్గొన్నారు.