- తాసిల్దార్ కార్యాలయం చుట్టూ కొన్ని ఏళ్లుగా
- ఓ వృద్ధుడు ప్రదక్షిణలు..
ప్రజాశక్తి-పత్తికొండ : ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన రైతులకు ప్రజలకు కార్మికులకు విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలని చెబుతాయి. క్షేత్రస్థాయి లో జరగడం లేదు అనడానికి పత్తికొండ తాసిల్దార్ కార్యాలయం నిదర్శనంగా మారింది. విద్యార్థులు రైతులు,ప్రజలు కార్మికులకు తాసిల్దార్ కార్యాలయం కార్యకలాపాలు అందడానికి అగచాట్లు తప్పడం లేదు. పత్తికొండ మండలం పెద్దహల్తి గ్రామానికి చెందిన పూజారి బ్రహ్మయ్య(65) సర్వే నంబర్ 29c 3.40 పట్టాదారు పాస్ పుస్తకం కోసం తాసిల్దార్ కార్యాలయం చుట్టూ కొన్ని ఏళ్లుగా తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాసిల్దార్ వీఆర్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కార్యాలయం చుట్టూ తిరగలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో రెండుసార్లు ఫిర్యాదు చేసిన కిందిస్థాయి అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాస్ పుస్తకం లేకపోవడంతో ప్రభుత్వం అందించే నష్టపరిహారం, రైతు భరోసా పిఎం కిసాన్ అనేక సంక్షేమ పథకాలు అందడం లేదని , గత సంవత్సరం పంట సాగు చేసి పంట నష్టం జరిగిన పరిహారం అందలేదని తమ బాధను మీడియా ముందు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.










