మేరీలాండ్ : కంటిలో కనిపించే ప్రతిబింబాలను 3డిలోకి మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసింది మేరీల్యాండ్ యూనివర్శిటీ. ఒక్కోసారి ఫొటో దిగినపుడు కంటిలో ప్రతిబింబం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనిషి కన్ను సమతులంగా ఉండటంతో ఈ ప్రతిబింబాలను అర్థం చేసుకోవడం కష్టతరం. అదే సమయంలో కంటిలోని కార్నియాలో ఆ ప్రతిబింబం పూర్తిగా పరుచుకుంటుంది. కార్నియాలో పరుచుకున్న ప్రతిబింబాలు తక్కువ రిజల్యూషన్‌తో అస్పష్టంగా ఉంటాయి. వాటిని 3డిలోకి మార్చి స్పష్టమైన నమూనాను అందించేలా పరిశోధకులు ఓ అప్లికేషన్‌ను రూపొందించారు. తద్వారా ఫొటోగ్రాఫ్‌లో కన్నా స్పష్టంగా వస్తువు ప్రతిబింబాన్ని 3డిలో పొందవచ్చు. ఈ పద్ధతితో పరిశోధకులు పలు 3డి నమూనాలను రూపొందించారు. ఈ పరిశోధనతో ఒక్కోసారి నేరాలను కూడా శోధించవచ్చు. ఈ పరిశోధన వివరాలను ఎఆర్‌ఎక్స్‌ఐవి ప్రీ -ప్రింట్ సర్వర్‌లో ప్రచురితమైంది. అయితే ఇంకా సమీక్షించాల్సి వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
;