- సర్పంచుల సంఘం అధ్యక్షులు ఏ.జయన్న
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : ప్రతి ఒక్కరూ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోడుమూరు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకెపోగు జయన్న అన్నారు. గురువారం కర్నూలు మండలం బి తాండ్రపాడు పంచాయతీ పరిధిలోని టీవీ9 కాలనీలో పాఠశాలలో శాంతిరం లేజర్ కంటి వైద్యశాల వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరు కంటి వైద్యశాలకు సంబంధించిన వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ మనిషి శరీరంలో అన్ని అవయవాల కంటే కళ్ళు అత్యంత ప్రధానమైనవి అని అన్నారు. కంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలన్నారు. కళ్ళు లేని జీవితం ఎంత దుర్భరమో ఊహించలేం అన్నారు. ప్రతి ఒక్కరు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పేదల కంటి ఆరోగ్యం కోసం ముందుకు వచ్చిన శాంతిరం లేజర్ కంటి వైద్యశాల వారి సేవలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ సునీల్, ఇమామ్ బాబు భరత్ రంజిత్ కుమార్ సాయి, స్థానిక గ్రామ టిడిపి నాయకులు ఏసు వెంకటేష్ యూసుఫ్ రసూల్ పాల్గొన్నారు.










