Jul 15,2023 16:04

ప్రజాశక్తి-వత్సవాయి : మండలంలోని  కన్నెవేడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం కొమరగిరి ట్రస్ట్, చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్దార్థ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మక్కపేట శ్రీ సాయి సెంచరీ హై స్కూల్ నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో ఈ వైద్య శిబిరం 80 మందికి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో 15 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది. వారిని పిన్నమనేని సిద్ధార్థ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక బస్ లో పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొమరగిరి భరద్వాజ్, ప్రతినిధులు కొమరగిరి సవిత, శోభ రుక్మిణి బండారు, డాక్టర్స్ జాహ్నవి, పవన్, PRO రాఘవ జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ ఎం అజ్మీర్ కొండ మరియు సిబ్బంది పాల్గొన్నారు.