May 07,2023 22:31

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. బిజెపి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. డిల్లీ మద్యం కేసుతో ఆప్‌కి సంబంధం ఉందను ఆరోపణలు అబద్ధమని కోర్టు ఉత్తర్వులతో నిరూపణ అయిందని ఆప్‌ నేతలు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు రాజేష్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రాలకుశనివారం ఢిల్లీలోనికోర్టు బెయిల్‌ మంజారు చేసింది. దీనిపై ఆప్‌ నేతలు, ఢిల్లీ మంత్రి అతిషి మర్లెనా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మనీలాండరింగ్‌, అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిందని, కోర్టు ఉత్తర్వులు ఆప్‌ నిజాయితీ గల పార్టీ అని స్పష్టం చేస్తునాుయని వారు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఇడి వాదనలు వైరుధ్యాలతో నిండి ఉనాుయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని ఆప్‌ నేతలు గుర్తు చేశారు.