ప్రజాశక్తి-నందిగామ : నందిగామ, చందర్లపాడు మండలం పలు గ్రామాలలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పుట్టగొడుగుల పుట్టకొస్తున్నాయి. చిన్న బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకొని మద్యం వ్యాపారం చేస్తున్న అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఒకవైపు ప్రభుత్వం మద్యం నిషేధమని చెబుతుంటే గ్రామాలలో మాత్రం మద్యం ఆపేది లేదంటూ మద్యం మాఫియా వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు సమాచారం ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకి గ్రామాల్లో మద్యం అమ్మే వ్యాపారస్తులకు ఆర్ధిక లావాదేవులు జరుగుతున్నాయని అనుకుంటూ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు స్పందించాలని ప్రజల కోరుతున్నారు.










