Oct 16,2023 10:36

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) మనోహర్‌ సింగ్‌ (ఎంఎస్‌) గిల్‌ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. వయస్సు సంబంధిత అనారోగ్యంతో దక్షిణ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో గిల్‌ కన్నుమూశారు. సోమవారం గిల్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో గిల్‌ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగానూ, అలాగే స్టాటిస్టిక్స్‌- ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిగానూ పనిచేశారు. గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి గిల్‌ 1996 నుంచి 2001 వరకూ సిఇసిగా పని చేశారు. పద్మవిభూషణ్‌ అవార్డు కూడా గిల్‌ అందుకున్నారు.