Oct 27,2023 08:03

బీజింగ్‌ (చైనా) : చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ (68) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో లీ కెకియాంగ్‌ మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. ఆయన ఒక సంస్కరణ-ఆలోచన కలిగిన బ్యూరోక్రాట్‌. గత సంవత్సరం పదవీ విరమణ చేశారు. పాలక చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీలో రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా లీకెకియాంగ్‌ పనిచేశారు. లీ కి గురువారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని, అతను విశ్రాంతి తీసుకుంటున్న షాంఘైలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే కెరీర్‌ బ్యూరోక్రాట్‌ ఆయన కార్యాలయంలో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలకు మద్దతు పలికారు.