తదేకంగా కళ్ళు ఆకాశం వైపుకి
చూస్తూనే వున్నాయి..
మురిపించిన మేఘమొకటి
ఆశ నిరాశల మధ్య పందెం పెట్టింది..
ఆశగా నాటిన విత్తులన్నింటికీ
నాలుక పిడచకట్టుకు పోతూంది..
ఆశ విత్తుని నాటితే
నిరాశ నీళ్లివ్వనంటోంది..
అక్కడక్కడ విత్తుని దాటి
తొంగి చూస్తున్న చిన్ని మొలకలు
ఆకాశం వైపుకి ఆత్రంగా చూస్తున్నాయి..
ఒక్కసారిగా కాళ్ళకి ఏదో తడి తాకిన భావన..
నా దైన్యం రాల్చిన కన్నీరు కాళ్లపై పడిందేమో..
కాలికి తాకుతున్న చిట్టి మొలక..
ఆ కిందే దాగిన విత్తనం
ఇక నా పొలం.. నేను..
ఒకరినొకరం ఓదార్చుకోవాలేమో..!!
అశోక్ గుంటుక
9908144099