మనిషి లేనిదే భూమికి విలువ లేదు
మనిషి లేనిదే ప్రకృతి లేదు
మనిషి లేనిదే మనుగడ లేదు
మనిషి లేనిదే సృష్టి లేదు
మనుషులు మనుషులు
ఎక్కడ చూసినా మనుషులే
వివిధ రకాల మతాలతో కులాలతో
అనేకమందితో సంబంధాలతో
బంధాలకు విలువనిస్తూ
అనేక కష్టాలను అనుభవిస్తూ
మంచి స్థాయిలో
ఉండడానికి కష్టపడుతూ
బాధ్యతలను నిర్వహిస్తూ
రక్తసంబంధానికి గౌరవం ఇస్తూ
మంచి పేరు కోసం తపన పడుతూ
డబ్బు కోసం ఆశపడుతూ
మంచి మనుషుల్లా బతకాలని ఆశిస్తూ
కోరుకున్నవన్నీ చేరుకునేలా
గమ్యాన్ని నిర్ణయిస్తూ
చేరుకున్నవన్నీ సాధించాక
చావడానికి సిద్ధపడతాడు మనిషి
అంతటితో మనిషి జీవితం సమాప్తం !
కట్ట శరణ్య,
8వ తరగతి,
అరవింద మోడల్ స్కూల్,
మంగళగిరి,
గుంటూరు జిల్లా.