- మండిపడ్డ భారత్
- ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగదంటూ ఖండన
స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : మణిపూర్‌లో హింసను ఆపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్కడి మతపరమైన మైనారిటీలకు రక్షించాలని భారత ప్రభుతాన్ని యురోపియన్ పార్లమెంట్ కోరింది. ఈ మేరకుగురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం సాయంత్రం ఈ అంశంపై చర్చ జరిగింది. పారిస్‌లో రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోడీ రావడానికి కాస్త ముందుగా ఈ తీర్మానం వెలువడింది. కాగా భారత ప్రభుత్వం వెంటనే దీనిపై ఘాటుగా స్పందించింది. ఇయు పార్లమెంట్ చర్య అమోదయోగ్యం కానిదని స్పష్టం చేసింది.
''మణిపూర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వంటి మతపరమైన మైనారిటీలను కాపాడేందుకు, తదుపరి హింస చెలరేగకుండా నివారించేందుకు'' భారత ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానం పేర్కొంది. మణిపూర్‌లో హింస చోటు చేసుకుంటున్న ప్రాంతాలకు జరులిస్టులు, అంతర్జాతీయ పరిశీలకులు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను కోరింది. మణిపూర్‌లో ఇంటర్‌నెట్‌పై నిషేధానిు ఎత్తివేయాలని కోరింది. ఐక్యరాజ్య సమితి సిఫార్సులకు అనుగుణంగా సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానిు రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది. భారత్‌తో జరిపే చర్చల్లో మానవ హక్కుల ప్రాముఖ్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించాల్సిందిగా ఇయు పార్లమెంట్‌స సభ్యులు ఇయుని కోరారు. కేవలం మణిపూర్‌లోనే కాకుండా మొత్తంగా భారతదేశంలో మైనారిటీల పరిస్థితి పట్ల పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- భారత్ ఖండన
ఈ తీర్మానంపై భారత్ మండిపడింది. ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాని చర్య అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ చర్య వలసవాద వైఖరిని ప్రతిబింబిస్తోందని అన్నారు. మణిపూర్‌లో పరిస్థితులపై న్యాయ వ్యవస్థతో సహా అనిు స్థాయిలో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇతరుల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బదులుగా వారి స్వంత విషయాలపై దృష్టి పెడితే బాగుంటుందని యురోపియన్ పార్లమెంట్‌కు సూచించారు.










