Jun 05,2023 15:19

ప్రజాశక్తి-తాళ్లరేవు : మడ అడవుల పెంపకం ద్వారా  మడ అభయాయారణ్యం ఉన్నచోట  మత్స్య సంపద, పర్యావరణం అభివృద్ధి చెంది  తీరప్రాంత గ్రామాల్లోని ఆవాసాలకు ప్రత్యేక ఆదాయం సమకూరుతుందని ఫారెస్ట్ రేంజర్ టి. సత్యనారాయణ అన్నారు. కోరంగి అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రభుత్వం పర్యావరణం అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా  75 కేంద్రాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.  కాకినాడ జిల్లాలో జిల్లా ఫారెస్ట్ అధికారి కేఎల్ రావు పర్యవేక్షణలో కందికుప్ప, కోరంగి అభయారణ్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు రేంజర్ తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పర్యావరణ సదస్సు  లైవ్ ప్రోగ్రాంను  సదస్సులో పాల్గొన్న వారు వీక్షించారు. భవిష్యత్తు తరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి పర్యావరణహిత సమాజాన్ని సమాజం కోసం మిస్టి అనే కార్యక్రమం ద్వారా తీర ప్రాంత గ్రామాల్లో మడ అడవులు పెంచి ఆవాస ప్రాంత ప్రజలకు ఆదాయం సమకూరేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, స్థానిక వైసిపి నాయకులు బూరెల వెంకటరాజు, వైస్ ఎంపీపీ దూలిపూడి నాగేంద్రప్రసాద్, ఎంపిటిసి రత్నకుమారి, మాట్లాడారు. అనంతరం ప్రత్యేకంగా మడ అడవుల పెంపకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిష్ బోన్ టెక్నాలజీ విధానంలో పలు మడ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త మృత్యుంజయరావు ,కేసరి శ్రీనివాస్, నోరి బలరామకృష్ణ, రేంజర్లు కే.దుర్గారాం ప్రసాద్, సత్య పద్మజ, ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు దివాకర్ రావు తేజేశ్వరరావు, ఫారెస్ట్ సిబ్బంది మహేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.