Oct 16,2023 16:03
  • రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 

ప్రజాశక్తి -అనంతపురం : అనంతపురం నగరంలోని కళ్యాణ దుర్గం బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం.ఎస్.కె  ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ షో రూమ్ ను సోమవారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఎమ్మెస్ కే ఆటోమొబైల్స్ వారు నూతన షో రూమ్ను ప్రారంభించడం అభినందనీయం అన్నారు వాహన కాలుష్యం నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగ పడడమే కాకుండా రవాణా ఖర్చు కూడా తగ్గుతుందన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు నిర్వాహకులు కూడా వినియోగదారులకు అవసరమైన సర్వీస్ ని కూడా పెంచగలిగితే మరింత అమ్మకాలు పెరిగే అవకాశం ఉందన్నారు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రీఛార్జ్ చేసే బంకులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. అందులో భాగంగా రాప్తాడు హైవే సమీపంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు నగరంలోని  కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూంను (జాయ్ ఈ బైక్) మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ధనుంజయ యాదవ్, రిటైర్డ్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి , జాయ్ ఈ బైక్స్ నిర్వాహకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు